బాహుబలి, దేవసేనను మరిచిపోవడం అంతా ఈజీ కాదు. బాహుబలి సినిమాలో ప్రభాస్ బాహుబలిగా, అనుష్క దేవసేనగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. కానీ అనుష్క మాత్రం సినిమాలకు దూరమైనట్టే వ్యవహరిస్తోంది. ఇలాంటి సమయంలో.. ప్రభాస్‌తో మరోసారి నటించి.. సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందట అనుష్క.
ప్రభాస్, అనుష్క కాంబినేషన్ బిల్లా సినిమాతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత మిర్చి సినిమాలో కలిసి నటించారు. ఇక ఆ తర్వాత ఈ ఇద్దరితో కలిసి బాహుబలి సిరీస్‌తో వండర్స్ క్రియేట్ చేశాడు రాజమౌళి. కానీ బాహుబలి తర్వాత సినిమాలు బాగా తగ్గించేసింది అనుష్క. ప్రస్తుతానికైతే.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో నటిస్తోంది. అయితే మరోసారి.. ప్రభాస్, అనుష్క కాంబినేషన్ రిపీట్ అయితే బాగుంటుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి ఇప్పుడో గుడ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
మరోసారి ప్రభాస్, అనుష్క ఒకటి కాదు.. రెండు సినిమాల్లో కలిసి నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇవే అనుష్క చివరి చిత్రాలని కూడా టాక్ నడుస్తోంది. ప్రస్తుతం మారుతితో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాలో ముగ్గురు యంగ్ హీరోయిన్లు నటిస్తుస్తున్నారు. అయినా కూడా మారుతి ఓ కీ రోల్ కోసం అనుష్కను సంప్రదించినట్టు తెలుస్తోంది. స్వీటి కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇదే కాదు.. మరో ప్రాజెక్ట్‌లోను ప్రభాస్‌తో నటించబోతోందట అనుష్క.
అప్పుడెప్పుడో హరిహర వీరమల్లు సినిమాను మొదలు పెట్టి.. కంప్లీట్ చేయలేకపోతున్న డైరెక్టర్ క్రిష్.. ప్రభాస్‌తో భారీ పిరియాడికల్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్టు చాలా రోజులుగా వినిపిస్తోంది. ఇప్పటికే బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు ఈ ప్రాజెక్ట్ సెట్ చేసే పనిలో ఉన్నారట. ఈ సినిమాలోనే ప్రభాస్, అనుష్క కలిసి నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమాల తర్వాత అనుష్క సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టనుందని టాక్. మరి నిజంగానే.. ఈ క్రేజీ కాంబో వర్కౌట్ అవుతుందేమో చూడాలి.