»Anupama Parameswarans Lip Lock Scene Sparks Internet Frenzy
Anupama Parameswaran: నెట్టింట వైరల్‌గా మారిన అనుపమ లిప్ లాక్..!
తెలుగులో పద్దతైన హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ టాప్ ప్లేస్‌లో ఉంటుంది. అయితే హద్దులు దాటి ప్రస్తుతం గ్లామర్ పాత్రలతో పాటు లిక్‌లాక్ సీన్లు కూడా చేస్తోంది. తాజాగా టిల్లు స్క్వేర్‌లో లిప్‌లాక్ సీన్లుతో రెచ్చిపోయింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
డీజే టిల్లు మూవీ ఎంత హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈ మూవీ సీక్వెన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. సీక్వెన్స్ మూవీ టిల్లు స్క్వేర్ లాస్ట్ ఇయర్ విడుదల కావాల్సింది కానీ.. పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. రీసెంట్ గా మూవీ విడుదల తేదీని ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో వాలంటైన్స్ డే రోజున ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ బాగా ఆకట్టుకుంది. సిద్ధు జొన్నలగడ్డ కామిక్ టైమింగ్ మరియు అనుపమ పరమేశ్వరన్ టోటల్ గ్లామరస్ మేకోవర్ హైలైట్ అయ్యాయి.
ఈ చిత్రం రొమాన్స్ , వినోదం రెండింటినీ అందిస్తుంది, అయితే ట్రైలర్లో చాలా రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి. పోస్టర్ల నుండి ట్రైలర్ వరకు, అనుపమ గ్లామరస్ లుక్స్ అన్నిటికంటే ఎక్కువ దృష్టి పెట్టాయి. ట్రైలర్లో కూడా లిప్ లాక్ సీన్ ప్రత్యేకంగా నిలిచి ఇంటర్నెట్లో హల్చల్ చేసి ఇన్స్టంట్ హాట్ టాపిక్‌గా మారింది. అనేక వాయిదాల తర్వాత ఈ చిత్రం మార్చి 29న విడుదల కానుంది. ఈ చిత్రం యువ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటికే సీక్వెల్ హైప్‌తో మంచి బజ్‌ను సృష్టించగలిగింది. బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు.
ఇంతకుముందు అద్భుతం, నరుడా డోనరుడా చిత్రాలకు దర్శకత్వం వహించిన మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. దీని ప్రీక్వెల్ లాగా, దీనికి శ్రీచరణ్ పాకాల, రామ్ మిరియాల స్వరాలు సమకూర్చారు.