యాంకర్‌గా అనసూయ (Anasuya) తనకంటు ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. జబర్థస్త్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ .పలు సినిమాల్లో కూడా ఛాన్స్‌లు కొట్టేసింది. క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా రంగస్థలం సినిమా (Rangasthalan Movie) లో రంగమ్మత్తగా అనసూయ నటనకు మంచి గుర్తింపు దక్కింది.
అనసూయ ఏం చేసిన, ఏం మాట్లాడిన కాంట్రవర్సీ అవుతుంది. ఆ మధ్య ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లిన కూడా అనసూయను నెటిజన్లు (Netizens) వదిలిపెట్టలేదు. బీచ్‌లో దిగిన బికిని ఫొటోలపై నెటిజన్లు నెగిటివ్‌గానే స్పందించారు. ఇద్దరి పిల్లలు ఉన్న నువ్వు , వారి ముందే ఇలాంటి డ్రెస్ ధరిస్తావా అంటూ ఆమెపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. వారికి ధీటుగానే అనసూయ సమాధానం ఇవ్వడం జరిగింది. తాజాగా తన భర్త పుట్టినరోజు సందర్భంగా అనసూయ ఆసక్తికరమైన ట్వీట్ (Tweet)చేసింది.
నీలాంటి భర్త, నీలాంటి తండ్రి, నీలాంటి కొడుకు, నీలాంటి అల్లుడు, నీలాంటి అన్న.. మొత్తానికి నీలాంటి మగాడు ఈ ప్రపంచానికి కావాలి అని ఆమె తన భర్త (husband)పై ప్రేమను వ్యక్తం చేసింది. తన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేసింది. అనసూయ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భర్త భరద్వాజ్(Bharadwaj) అంటే అనసూయకు ఎంత ప్రేమో ఈ పోస్ట్ ద్వారా అనసూయ మరోసారి తెలియజేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.