పుష్ప మూవీ ఎంత సంచలనంగా నిలిచిందో అందిరికీ తెలిసిందే. అసలు ఈ సినిమా ఈ స్థాయిలో హిట్ అవుతుందని సుకుమార్ కూడా ఊహించలేదు. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు సుకుమార్. ఇక స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ను ఐకాన్ స్టార్‌గా మార్చిన పుష్ప.. పాన్ ఇండియా స్టార్డమ్ కూడా తీసుకొచ్చింది. ఇక హిందీ జనాలైతే ఈ మూవీని బాలీవుడ్ ఫిల్మ్ కంటే ఎక్కువగా ఆదరించారు. మొత్తంగా పుష్ప పాటలు, డైలాగ్స్, బన్నీ మాసివ్ పర్ఫార్మెన్స్.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే సీక్వెల్‌ను అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల పుష్ప మూవీని మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు.
ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్స్‌గా నిలిచిన చిత్రాల కేటగిరిలో.. తెలుగు, ఇంగ్లీష్, రష్యన్.. సబ్ టైటిల్స్‌తో ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో పుష్పను రష్యా భాషలో అనువదించి రిలీజ్ చేయబోతున్నారు. అతి త్వరలోనే రష్యన్ డబ్బింగ్ వర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్ కానుంది. దాంతో అక్కడ కూడా పుష్ప దుమ్ము దులపడం ఖాయమంటున్నారు. అలాగే రష్యాలో ఈ మూవీకి వచ్చే రెస్పాన్స్‌ను బట్టి మరికొన్ని దేశాల్లోనూ రిలీజ్ చేసే అవకాశం లేకపోలేదు. ఇకపోతే.. పుష్ప 2 రెగ్యూలర్ షూటింగ్‌కు రంగం సిద్దమవుతోంది. ఈ క్రమంలో లొకేషన్ వేటలో ఉందట చిత్ర యూనిట్. ఇది ఫైనల్ అవగానే షూట్ స్టార్ట్ చేయనున్నారట. ఇక రష్మిక హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను.. మైత్రీ మూవీ నిర్మిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి పుష్ప2 ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.