ఇప్పటి వరకు నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్టింగ్ చేస్తారని ఎవరు ఊహించి ఉండరు. కానీ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. బాలయ్యతో ఆహా ఓటిటిలో అన్ స్టాపబుల్ టాక్ షో చేసి సక్సెస్ అయ్యారు. బాలయ్య క్రేజ్‌తో ఈ షో అన్ని షోలకు అమ్మ మొగుడిలా మారిపోయింది. దాంతో ఇప్పుడు అల్లు కాంపౌండ్‌లో మెగా హీరోలకంటే.. బాలయ్య పేరే ఎక్కువగా వినిపిస్తోంది. రీసెంట్గా ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా బాలయ్యనే గెస్ట్‌గా వచ్చారు. అంటే అల్లు వారితో బాలయ్య బాండింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే అల్లు అరవింద్ మరోసారి బాలయ్యతో ఎవరు ఊహించని ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు.. గత రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది.
అయితే ఇది కేవలం పుకారేనని అనుకున్నారు. కానీ నిజంగానే అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్‌లో బాలయ్యతో ప్రయోగం చేసే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది. ‘కేరాఫ్ కంచరపాలెం’ డెరెక్టర్ వెంకటేష్ మహా.. ఇటీవలె బాలయ్యకు కథ చెప్పాడట. అది ఆయనకు బాగా నచ్చిందనేది ఇండస్ట్రీ టాక్. ఇక బలయ్య ముక్కుసూటి మనిషి.. పైగా నాన్చుడు వ్యవహారం ఉండదు కాబట్టి.. వీలైనంత త్వరగా.. 30 రోజుల్లోనే ఈ సినిమాను పూర్తి చేయాలని చెప్పారట. ఇదే నిజమైతే.. బాలయ్యను సరికొత్త పాత్రలో చూడడం ఖాయమని చెప్పొచ్చు. అయితే అసలు ఆ దర్శకుడితో బాలయ్య నిజంగానే సినిమా చేస్తాడా.. అనేది సందేహంగానే ఉంది. కానీ అల్లు అరవింద్ తలుచుకుంటే ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి బాలయ్య ఈ సినిమాను నిజంగానే చేస్తారేమో చూడాలి.