»Alia Bhatt Is A Star Hero Wearing Sandals Viral Video
Viral Video: ఆలియా భట్ చెప్పులు మోసిన స్టార్ హీరో..!
మేం స్టార్ హీరోలం.. అయితే ఏంటి? అనేది బాలీవుడ్ హీరోల కాన్సెప్ట్. చాలా సందర్భాల్లో ఈ విషయం ప్రూవ్ అయింది. అయితే భార్యల విషయంలో బాలీవుడ్ హీరోలు చేసే చేష్టలు అతికి మించి ఉంటాయనడంలో ఎలాంటి సందేహాలు లేవు. అందుకు ఎగ్జాంపులే.. లేటెస్ట్ వీడియో అని చెప్పొచ్చు.
ఆ మధ్య బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో హృతిక్ రోషన్(Hritik Roshan).. ఏకంగా తన ప్రియురాలి చెప్పులను మోస్తు కనిపించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేసేసింది. తన భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత.. సింగర్ సబా ఆజాద్‌తో రిలేషన్లో ఉన్నాడు హృతిక్. ఎక్కడికెళ్లిన ఈ ఇద్దరు కలిసే వెళ్తుంటారు. రీసెంట్గా ముంబయిలో ఓ ఇవెంట్లో.. సబా ఫోటోలకు ఫోజులిస్తుండగా.. ఆమె వెనకాల హిల్స్ పట్టుకుని కనిపించాడు హృతిక్. ఇక ఇప్పుడు రణ్ బీర్ కపూర్(Ranbir kapoor) కూడా భార్య చెప్పులు మోస్తున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఆలియా భట్ చెప్పులు మోసిన హీరో రణబీర్ కపూర్ వీడియో:
రణ్ బీర్ కపూర్(Ranbir kapoor), ఆలియా భట్(Alia bhatt) ఇద్దరు భార్య భర్తలు. ఈ మధ్యే ఈ జంటకు కూతురు పుట్టింది. అయితే తాజాగా బాలీవుడ్ దర్శక, నిర్మాత ఆదిత్య చోప్రా ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి పమేలా చోప్రా కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు.. ఆలియా భట్, రణ్ బీర్ వాళ్లింటికి వెళ్లారు. ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ వీడియో రికార్డ్ అయింది. ఆలియా ఇంట్లోకి వెళ్తూ గుమ్మం దగ్గర చెప్పులు విడిచి లోపలికి వెళ్లగా.. రణ్ బీర్(Ranbir kapoor) మాత్రం ఆ చెప్పులను తీసి గుమ్మం పక్కకు పెట్టాడు.
రణ్‌బీర్(Ranbir kapoor) గడప ముందు చెప్పులు ఉండటం మంచిది కాదని భావించాడో ఏమో గానీ.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ రకరకాల ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కానీ రణ్‌బీర్ లాంటి భర్త దొరకడం ఆలియా(Alia bhatt) అదృష్టం అంటూ.. చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా.. భార్యల చెప్పులు మోయడంలో బాలీవుడ్ హీరోలదే పై చేయి అని చెప్పొచ్చు.