ఏజెంట్ సినిమా(Agent Movie) ప్రమోషన్స్‌లో భాగంగా అక్కినేని అఖిల్(Akkineni akhil) 170 అడుగుల నుంచి దూకాడు. ఫుల్ యాక్షన్ నేపథ్యంలో ఏజెంట్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం అఖిల్ రెండేళ్ల నుంచి కష్టపడుతూ ఉన్నాడు. ఇందులో మాస్ లుక్ తో అందర్నీ ఆకట్టుకోనున్నాడు. ఇప్పటి వరకూ అఖిల్ సినీ కెరీర్ చూస్తే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్’ తప్పా మిగిలిన సినిమాలన్నీ అంతంత మాత్రమే ఆడాయి. అందుకే ఏజెంట్ మూవీపై అఖిల్ భారీగా ఆశలు పెట్టుకున్నాడు.
ఏజెంట్ మూవీ ప్రమోషన్స్ కోసం అఖిల్ చేసిన స్టంట్ వీడియో:
ఏజెంట్ మూవీ(Agent Movie)కి డైనమిక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇందులో సాక్షి వైద్య(Sakshi vydya) హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఏజెంట్ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty) కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ సినిమాలో కండలు తిరిగిన దేహంతో అఖిల్ కనిపించనున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్(Teaser), సాంగ్స్ రిలీజ్ అయ్యాయి.
తాజా ఏజెంట్ మూవీ(Agent Movie) ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడలోని పీవీపీ మాల్ వద్ద చిత్ర యూనిట్ సరికొత్త ప్రమోషన్స్(Promotions) చేసింది. అఖిల్ (Akkineni akhil) 172 అడుగుల మీద నుంచి క్రేన్, తాళ్ల సాయంతో కిందకి దూకి ప్రేక్షకుల ముందుకు ఎంట్రీ ఇచ్చాడు. మాల్ బిల్డింగ్ పై నుంచి అఖిల్ దూకడంతో అభిమానులు అఖిల్ పై పూల వర్షం కురిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.