తెలుగు సినిమా ఇండస్ట్రీ(Telugu Industry)ని సుకుమార్(Sukumar) శిష్యులు ఏలుతున్నారు. ‘ఆర్య’ సినిమాతో సుకుమార్ డైరెక్టర్‌గా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్(Tollywood) జీనియస్ డైరెక్టర్‌గా ప్రత్యేక క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. పుష్ఫ సినిమా(Pushpa Movie)తో పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు సుకుమార్ శిష్యులు కూడా వరుస సినిమాలు తీస్తూ ముందుకు సాగుతున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్(Sukumar Writing Banners) ద్వారా శిష్యులంతా ఇప్పుడు డైరెక్టర్లుగా మారి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.
ఉప్పెన(Uppena) సినిమాతో బుచ్చిబాబు(Buchibabu) డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. బుచ్చిబాబు సుకుమార్ ప్రియశిష్యుడని టాలీవుడ్ టాక్. ఇప్పుడు రామ్ చరణ్‌తో బుచ్చిబాబు సినిమా చేయబోతున్నాడు. దసరా(Dasara) సినిమాతో తన సత్తా చాటిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. గతంలో ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’ సినిమాలకు సుకుమార్(Sukumar) దగ్గర పనిచేశాడు. ‘కరెంట్’ సినిమాతో పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్టర్ గా మారాడు. సుకుమార్ నేతృత్వంలో రెండో సినిమా ‘కుమారి 21F’తో హిట్టు కొట్టాడు. గత ఏడాది ’18 పేజెస్’ సినిమా తీశాడు.
టాలీవుడ్(Tollywood) స్టార్ రైటర్ అయిన శ్రీకాంత్ విస్సా కూడా సుకుమార్(Sukumar) శిష్యుడే. ‘పుష్ప’, ’18 పేజెస్’ సినిమాలకు స్క్రిప్టు అందించాడు. ఇప్పుడు డెవిల్, టైగర్ నాగేశ్వరరావు వంటి పాన్ ఇండియా(Pan India) సినిమాలకు రైటర్‌గా పనిచేస్తున్నాడు. జక్కా హరి ప్రసాద్ గతంలో దర్శకుడు అనే సినిమా తీశాడు. ‘100% లవ్’ సినిమాకు స్క్రీన్ ప్లే ఇచ్చి ఆ తర్వాత ‘1 నేనొక్కడినే’ మూవీకి రచయిత(Writer)గా మారాడు. ‘ప్లే బ్యాక్’ మూవీ చేశాడు.
యాంకర్ ప్రదీప్(Anchor Pradeep)తో ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమాను డైరెక్టర్ మున్నా తీశాడు. మున్నా కూడా సుకుమార్(Sukumar) శిష్యుడే. అలాగే ‘బొమ్మరిల్లు’ భాస్కర్ కూడా ‘ఆర్య’ సినిమాకు సుకుమాదర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసినవాడే. సుకుమార్ మరో శిష్యుడు అయిన వేమారెడ్డి ఓ పెద్ద ప్రాజెక్టు చేస్తున్నాడు. ‘భమ్ భోలేనాథ్’ ఫేమ్ కార్తీక్ దండు కూడా సుకుమార్ శిష్యుడే. తాజాగా ఆయన సుకుమార్ బ్యానర్లో సాయి ధరమ్ తేజ్‌తో ‘విరూపాక్ష'(Virupaksha) సినిమా చేస్తున్నాడు.