Agent Movie : ‘ఏజెంట్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్!
అక్కినేని థర్డ్ జనరేషన్ హీరో అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ.. ఏప్రిల్ 28న గ్రాండ్‌గా థియేటర్లో విడుదల అవుతోంది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా.. అదిరిపోయే యాక్షన్‌తో ఏజెంట్‌ను తెరకెక్కించాడు.
అక్కినేని థర్డ్ జనరేషన్ హీరో అఖిల్(Hero Akhil) నటించిన ఏజెంట్ మూవీ(Agent Movie ).. ఏప్రిల్ 28న గ్రాండ్‌గా థియేటర్లో విడుదల అవుతోంది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా.. అదిరిపోయే యాక్షన్‌తో ఏజెంట్‌ను తెరకెక్కించాడు. ఈ సినిమాతో సాక్షి వైద్య(Actress Sakshi Vydya) అనే క్యూట్ బ్యూటీ హీరోయిన్గా పరిచయం అవుతోంది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో అఖిల్(Hero Akhil) బాక్సాఫీస్ బద్దలు కొట్టాలని చూస్తున్నాడు.
ఇప్పటికే ఏజెంట్(Agent Movie ) ప్రమోషన్స్‌తో సినిమా పై సాలిడ్ బజ్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా అఖిల్(Hero Akhil) వైల్డ్ సాలేగా రియల్ స్టంట్స్ చేస్తుండడం విశేషం. ఇక ఏజెంట్ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాను అఖిల్ మార్కెట్‌కు మించిన బడ్జెట్‌తో నిర్మించినట్టు తెలుస్తోంది. కాబట్టి.. అఖిల్ మార్కెట్‌కు మించి రాబట్టాలంటే.. హిట్‌కి మించి బ్లాక్ బస్టర్ టాక్ రాబట్టాల్సి ఉంది ఏజెంట్(Agent Movie ). ముఖ్యంగా ఏజెంట్ ఓపెనింగ్స్ పై భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఓపెనింగ్స్ లెక్కలు వేసుకుంటున్నారు.
తాజాగా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 29.30 కోట్ల ఏజెంట్(Agent Movie ) బిజినెస్ జరిగిందని అంటున్నారు. నైజాం 10 కోట్లు.. సీడెడ్ 4.50 కోట్లు.. ఆంధ్రా 14.80 కోట్లు బిజినెస్ జరిగిందట. ఇక రెస్టాఫ్ ఇండియా కలుపుకొని 3.80 కోట్లు.. ఓవర్సీస్లో 3.10 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 36.20 కోట్ల బిజినెస్ జరుపుకుందట ఏజెంట్(Agent Movie ). దీంతో ఏజెంట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 37 కోట్లుగా ఫిక్స్ అయిపోయింది. ఈ లెక్కన ఏజెంట్ ముందు భారీ టార్గెట్ ఉందనే చెప్పాలి. మరి ఏజెంట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను ఎన్ని రోజుల్లో రీచ్ అవుతుందో చూడాలి. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించగా.. అనిల్ సుంకరతో కలిసి సురేందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించాడు.