»Affair With Bellamkonda Ganesh Heroine Varsha Responded
Varsha Bollamma: బెల్లంకొండ గణేష్ తో ఎఫైర్.. స్పందించిన హీరోయిన్ వర్ష
హీరో బెల్లంకొండ గణేష్‌తో తన పెళ్లి వార్తలపై హీరోయిన వర్ష బొల్లమ్మ స్పందించారు. గణేష్‌తో ప్రేమయాణం నడిపిస్తుందని, పార్టీల్లో, పబ్బుల్లో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుందని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
Affair with Bellamkonda Ganesh.. Heroine Varsha responded
Varsha Bollamma: ఇండస్ట్రిలో నటీనటులపై వచ్చే ప్రేమ వార్తలను వారు పెద్ద సీరియస్‌గా తీసుకోరు. కానీ దేనికైనా లిమిట్స్ ఉంటాయి. అవి దాటితేనే సమస్యలు. ప్రస్తుతం ఈ తరహా కామెంట్లను, ట్రోల్స్‌ను ఎదుర్కొంటుంది తెలుగు ముద్దుగుమ్మ హీరోయిన్ వర్ష బొల్లమ్మ. ఒక వైపు హీరోయిన్గా చేస్తూనే.. మరో వైపు ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా చేస్తుంది. తన కళ్లతోనే అనేక రకాల భావాలు పలికించే ఈ భామ బెల్లం కొండ సాయి గణేష్‌తో ప్రేమయాణం నడిపిస్తుందని, పార్టీల్లో, పబ్బుల్లో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుందని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వాటిపై స్పందించింది వర్ష.
వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్, స్టాండ్ అప్ రాహుల్, స్వాతిముత్యం సినిమాలు తనకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. తాజాగా సందీప్ కిషన్ జోడిగా ప్రేక్షకులను పలకరించడానికి ఊరు పేరు భైరవకోన చిత్రంతో రెడీ అవుతోంది. రేపు ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లో పాల్గొన్న వర్షకు, గణేష్‌తో పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురైంది. దీనిపై హీరోయిన్ స్పందిస్తూ.. సాధారణంగా ఒక హీరో-హీరోయిన్ ఎక్కడైనా కలిసి కనిపిస్తే వారిపై పుకార్లు వస్తుంటాయి. కానీ తన విషయంలో ఇందుకు భిన్నంగా జరిగిందని చెబుతుంది. స్వాతిముత్యం సినిమాలో ఇద్దరం కలిసి నటించాము, సినిమా విడుదల తరువాత మళ్లీ గణేష్ ను కలిసింది కూడా లేదు. అయినా పుకార్లు పుట్టించారు. ఈ గాసిప్స్ ఎవరు పుట్టిస్తారో తెలియదు కానీ వాటిని కంట్రోల్ చేయడం మాత్రం చాలా కష్టం అని వర్ష చెప్పింది.