నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘అఖండ 2’ మూవీ సూపర్ హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా OTT ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా జనవరి 9 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ నెట్ఫ్లిక్స్ పోస్టు పెట్టింది. ఇక ఈ సినిమాలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా తదితరులు నటించారు.