MHBD: తొర్రూరు మండలంలో మున్సిపల్ ఎన్నికల వేడి వేడెక్కింది. మున్సిపల్ ఛైర్మన్ పీఠం కోసం ప్రధానంగా మూడు పార్టీల నాయకులు సమావేశాలతో దూసుకెళ్తున్నారు. కానీ ఆశావహుల్లో రిజర్వేషన్ గుబులు పట్టుకుంది. గతంలో ఉన్న రిజర్వేషన్ ఉంటుందా లేదా మారుతుందా అనే ఆందోళన ఆశావాహులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. తొర్రూరులో 16 వార్డులకు గాను 19,100 ఓటర్లు ఉన్నారు.