ప్రకాశం: మార్కాపురం మండలం తిప్పాయపాలెం గ్రామంలో ‘స్వచ్ఛ సంక్రాంతి గ్రామసభను సోమవారం ఘనంగా నిర్వహించారు. పరిశుభ్రతే గ్రామాల గౌరవానికి, గుర్తింపుకు మూలమని జిల్లా కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడితేనే అభివృద్ధి వేగవంతమవుతుందని, పెట్టుబడులు కూడా ఆకర్షితమవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు.