ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేస్తోంది. దర్శకుడు ఓం రౌత్ అక్టోబర్ 2న ఆదిపురుష్ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అయోధ్యలో టీజర్ లాంచింగ్ గ్రాండ్‌గా జరగబోతోంది. ‘ఆదిపురుష్’ షూటింగ్ కంప్లీట్ అయి నెలలు కావస్తున్నా.. కనీసం ఇప్పటి వరకు ఒక్క లుక్ కూడా బయటికి రాలేదు. దాంతో ప్రభాస్‌ను రాముడి లుక్‌లో చూసేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే ఒక్కసారి రంగంలోకి దిగితే.. ప్రమోషన్స్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందుకే ఫస్ట్ లుక్, టీజర్‌ను రిలీజ్ చేసి.. వరుస అప్డేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఇప్పుడు ఆ సమయం వచ్చేసినట్టేనని చెప్పొచ్చు. అయితే అయోధ్యకు ప్రభాస్ అటెండ్ అవుతాడా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే ఆదిపురుష్ టీజర్ గురించి అప్పుడే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే టీజర్ కట్ చేశారని.. దాన్ని ఓం రౌత్ కొందరు బాలీవుడ్ ప్రముఖులకు ముందే చూపించారని వార్తలొస్తున్నాయి. ఇక ‘ఆదిపురుష్’ టీజర్ చూసిన వారు.. అదిరిపోయిందని.. విజువల్ ఎఫెక్ట్స్.. ప్రభాస్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉందని అంటున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు కొందరు. అయితే అసలు ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ.. ఈ టీజర్ టాక్ మాత్రం అంచనాలను పెంచేస్తోంది. మరి జనవరి 12న రానున్న ‘ఆదిపురుష్’ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.