Adipurush: ‘ఆదిపురుష్’ షాకింగ్ రన్ టైం.. ఒక్క కట్ కూడా లేకుండా..!
జరిగితే జూన్ 16న బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన జరగాలి.. లేదంటే ఆ రోజు పెద్ద గుణపాఠమే అవుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్.. మరో వారం రోజుల్లో థియేటర్లోకి రాబోతోంది. ప్రస్తుతం మూవీ లవర్స్ చూపు మొత్తం 'ఆదిపురుష్' మీదే ఉంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కంప్లీట్ చేసుకుంది.. కాకపోతే షాకింగ్ రన్ టైంతో రాబోతోంది ఆదిపురుష్.
దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ఓం రౌత్ దర్శకత్వంలో విజువల్ వండర్‌గా తెరకెక్కింది ఆదిపురుష్. ప్రభాస్ శ్రీరాముడిగా నటించగా.. కృతి సనన్ సీత పాత్రలో నటించింది. రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఆదిపురుష్ టీజర్, ట్రైలర్స్, సాంగ్స్, తిరుపతిలో జరిగిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఒక్క కట్ కూడా లేకుండా.. ఈ సినిమాకు క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇది ఆదిపురుష్ పై మరింత బజ్ క్రియేట్ చేస్తోంది. స్టార్టింగ్‌లో టీజర్ రిలీజ్ అయిన సమయంలో ఈ సినిమా పై ఎన్నో విమర్శలు వచ్చాయి.
రామాయణాన్ని వక్రీకరించారని కోర్టు మెట్లు కూడా ఎక్కారు కొందరు. కానీ సెన్సార్ బోర్డ్ ఒక్క కట్ కూడా లేకుండా సర్టిఫికేట్ ఇవ్వడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక సెన్సార్ టాక్ ప్రకారం.. ఆదిపురుష్’ చూసిన సెన్సార్ సభ్యులు దర్శక, నిర్మాతలను ప్రశంసించారని బీ టౌన్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు అదిరిపోయాయని.. ప్రభాస్ కటౌట్, యాక్టింగ్, ఎమోషన్స్ పీక్స్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా రన్ టైమ్ మాత్రం దాదాపుగా మూడు గంటలు ఉండడం కాస్త షాకింగ్‌గానే ఉంది.
సెన్సార్ రిపోర్టు ప్రకారం ఆదిపురుష్ నిడివి 2 గంటల 59 నిమిషాలుగా ఉంది. ఈ మధ్య కాలంలో ఇంత లాంగ్ రన్ టైంతో వస్తున్న సినిమా ఇదే. మూడు గంటలు ఆడియెన్స్‌ని థియేటర్లో కూర్చొబెట్టాలంటే.. మామూలు విషయం కాదు. అది కూడా అందరికీ తెలిసిన రామాయణాన్ని మూడు గంటలు చూస్తారా? అంటే.. ఆదిపురుష్‌తో ఓం రౌత్ అద్భుతమే చేయాలి. మరి జూన్ 16న ఏం జరుగుతుందో చూడాలి.