»Actress Anjali Actress Anjali As Ratnamala In Vs11 Poster Release
Actress Anjali: ‘VS11’లో రత్నమాలగా విలక్షణ నటి అంజలి..పోస్టర్ రిలీజ్
విశ్వక్సేన్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం VS11. ఈ మూవీలో నటి అంజలి కూడా నటిస్తోంది. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో ఆమె రత్నమాలగా కనిపించనుంది.
విలక్షణ నటి అంజలి(Actress Anjali) పుట్టినరోజు జూన్ 16న కావడంతో ఈ మూవీ నుంచి ఆమె ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ రిలీజ్(First Look Release) చేశారు. ఈ సినిమాలో ఆమె రత్నమాలగా కనిపించనున్నట్లు మేకర్స్ తెలిపారు. లిటిల్ మేస్ట్రో యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి పోస్టర్లు విడుదల అయ్యాయి. విశ్వక్ సేన్(Viswaksen) గంగానమ్మ జాతర, రాగ్స్ టు రిచ్స్ పోస్టర్లు అందర్నీ ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలుపనున్నట్లు మేకర్స్ తెలిపారు.