ఆదిపురుష్ సినిమాకు వానరం వచ్చింది. థియేటర్లో సినిమా ప్రదర్శితం అవుతుండగా వానరం రావడంతో ప్రేక్షకులు జైశ్రీరామ్ అంటూ నినదించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
రెబల్ స్టార్ ప్రభాస్(Prabhash) ‘ఆదిపురుష్’ మూవీతో(Adipurush Movie) ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీంతో థియేటర్లకు జనం క్యూ కడుతున్నారు. రెండు నెలల తర్వాత భారీ బడ్జెట్ సినిమా విడుదలవ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా ‘ఆదిపురుష్’ మేనియా కొనసాగుతోంది. రామాయణం(Ramayanam) లాంటి గొప్ప కథ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కడంతో ఈమూవీపై మంచి హైప్ నెలకొంది. ఈ మూవీ ట్రైలర్(Trailer), పాటల వల్ల విపరీతమైన క్రేజ్ వచ్చింది.
— Prasad Bhimanadham (@Prasad_Darling) June 16, 2023
‘ఆదిపురుష్'(Adipurush Movie) యూనిట్ ఈ మూవీ ప్రదర్శితం అయ్యే ప్రతి థియేటర్లోనూ హనుమంతుడి కోసం ఓ సీట్ కేటాయించింది. హనుమంతుడు వచ్చి సినిమా చూస్తాడనే నమ్మకంతో ఓ సీటు విక్రయించకుండా వదిలేశారు. తాజాగా ‘ఆదిపురుష్’ ప్రదర్శితం అవుతున్న ఓ థియేటర్లోకి వానరం(Monkey) వచ్చింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.
ఓ వానరం(Monkey) వచ్చి ‘ఆదిపురుష్’ మూవీ(Adipurush Movie) ప్రదర్శితం అవుతుండగా కాసేపు స్క్రీన్ వైపే చూసింది. దీంతో థియేటర్లో సినిమా చూస్తున్న ప్రేక్షకుల నుంచి జై శ్రీరామ్ నినాదం వినిపించింది. ఆ తర్వాత కొన్ని క్షణాల తర్వాత ఆ వానరం(Monkey) అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది. ‘ఆదిపురుష్’ మూవీ రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కింది. ఈ మూవీకి ఓం రౌత్(Om Raut) దర్శకత్వం వహించాడు. రాముడిగా ప్రభాష్(Prabhash), సీతగా కృతిసనన్(Kritisanan), లంకాధిపతి రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు.