»Court Directs Dhanush And Aishwarya Rajinikanth To Appear Physically In Divorce Plea
Dhanush : ధనుష్, ఐశ్వర్య జంటకు విడాకుల విషయంలో కోర్టు నోటీసులు
సూపర్ స్టార్ రాజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, తమిళ స్టార్ హీరో ధనుష్‌లకు చెన్నై ఫ్యామిలీ కోర్టు నోటీసులు జారీ చేసింది. విడాకుల విషయంలో వీరిద్దరూ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Dhanush And Aishwarya Rajinikanth : ధనుష్, ఐశ్వర్య జంట తాము విడిపోవాలని అనుకుంటున్నట్లు రెండేళ్ల క్రితం ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ విడాకుల(Divorce) కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టులో (Chennai family court) దరఖాస్తు చేసుకున్నారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం అక్టోబర్ 7న ధనుష్, ఐశ్వర్యలు ఇద్దరూ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు వారిద్దరికీ నోటీసులు పంపించింది.
రజనీకాంత్ కుమార్తె అయిన ఐశ్వర్య, తమిళ స్టార్ నటుడు ధనుష్‌లు 18 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. 2022 జనవరిలో ఉన్నట్లుండి తాము విడిపోవాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విసయాన్ని వారు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘18 ఏళ్ల పాటు స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా అర్థం చేసుకుని మా ప్రయాణాన్ని కొనసాగించాం. కానీ ఇప్పుడు మేము వేరు వేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధం అయ్యాం. మేమిద్దరం విడిపోవాలనుకుంటున్నాం’ అంటూ ప్రకటన చేశారు.
రజనీకాంత్(Rajinikanth) కుమార్తె అయిన ఐశ్వర్య 2004లో ధనుష్‌ను పెళ్లాడారు. వీరికి యాత్ర, లింగ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. గత రెండేళ్లుగా వీరిద్దరూ విడి విడిగా జీవిస్తున్నారు. ప్రస్తుతం పిల్లలిద్దరూ ఐశ్వర్య దగ్గరే ఉంటున్నారు.