ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చెన్నై పోరూరు రామచంద్ర ఆస్పత్రికి కమలహాసన్ ను తరలించారు కుటుంబ సభ్యులు. నిన్నటి నుంచి తీవ్ర జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడం లో కమలహాసన్ ఇబ్బందులు పడుతున్నారు. నిన్న అర్ధరాత్రి హీరో కమల్ హాసన్ ను రామచంద్ర ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకొని ఇంటికి రావాలని పూజలు చేస్తున్నారు కమల్ హాసన్ ఫ్యాన్స్.
కమల్‌హాసన్ ఇంతకుముందు కరోనా బారిన పడ్డారు. అప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందారు. తిరిగి ఇప్పుడు శ్వాస సమస్య తలెత్తడంతో ఆసుపత్రిలో చేరారు. కాగా పోస్ట్ కోవిడ్ లక్షణాలు అయ్యుంటాయని అందుకనే ఆయనకు శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు వచ్చాయని డాక్టర్లబృందం అనుకుంటుంది. కాగా బుధవారం కమల్ హైదరాబాద్ కు వచ్చి దర్శకుడు కె.విశ్వనాథ్‌ని కలిశారు. సాయంత్రం తిరిగి చెన్నై వెళ్లిపోయారు..ఇంతలోనే ఇలా జరిగిందని ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు.