»Aamir Khan Ex Wife Reena Dutta Are All Smiles As They Pose For Photographers Outside Mumbai Jewellery Shop
Aamir Khan: అమీర్ ఖాన్, మొదటి భార్య రీనా దత్తాతో మళ్లీ కలిశాడా?
అమీర్ ఖాన్ తన మొదటి భార్య రీనా దత్తాతో కలిసి ముంబైలోని ఓ నగల షాప్ బయట సందడి చేశారు. ఇద్దరు నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. తరువాత ఇద్దరు కలిసి ఒకే కారులో వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనిపై బాలీవుడ్ లో తెగ చర్చ నడుస్తుంది. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ చక్కర్లు కోడుతుంది.
Aamir Khan, ex-wife Reena Dutta are all smiles as they pose for photographers outside Mumbai jewellery shop
Aamir Khan: అమీర్ ఖాన్(Aamir Khan) తన మొదటి భార్య రీనా దత్తా(Reena Dutta) బుధవారం సాయంత్రం ముంబై( Mumbai)లో కనిపించారు. ఇద్దరూ ఓ నగల దుకాణం బయట ఫోటోలకు సంతోషంగా పోజులిచ్చారు. తరువాత ఒకే కారులో ఎక్కి వెళ్లిపోయారు. అయితే ఇద్దరు షాపింగ్ కోసం బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. అమీర్ కుర్తా పైజామాలో మంచి ఫ్యామిలీ మ్యాన్ లా కనిపిస్తుండగా, రీనా కుర్తా ప్యాంట్ లుక్లో మెరిసింది. జ్యూవెలరీ షాప్ బయట వారు ఫోటోగ్రాఫర్లకు ఫోటోలు ఇస్తున్న వీడియోను ఓ వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దానికి అమీర్ ఖాన్, అతని మాజీ భార్య తిరిగి కలుస్తారని, కొన్నిసార్లు, స్నేహం సంబంధాలను మించిపోతుందని రుజువు చేస్తుందని అని కాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోపై ఓ అభిమాని వావ్ అద్భుతంగా ఉంది అని రాశాడు. మరికొంత మంది ఈ జంట ఇతర మాజీ జంటలకు ఒక మంచి సందేశం ఇచ్చారని తెలిపాడు. అలాగే అమీర్ ఖాన్ కు అస్సలు ఈగో లేదని, చాలా మంచివాడని, గొప్పవ్యక్తిత్వం అని పేర్కొన్నారు. అయితే వీరు 16 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. అప్పటికే వీరికి ఒక కుమారుడు జునైద్ ఖాన్, ఒక కుమార్తె ఇరా ఖాన్ ఉన్నారు. తరువాత అమీర్ చిత్ర నిర్మాత కిరణ్ రావుతో రెండో వివాహం చేసుకున్నారు. వీరు కూడా 15 ఏళ్ల తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. వీరికి ఆజాద్ రావ్ ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. ఒక సందర్భంలో అమీర్ ఖాన్ తన మొదటి భార్యతో విడాకుల గురించి స్పందిస్తూ.. రీనాను పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరూ చాలా చిన్నవాళ్లని, పెళ్లి తరువాత ఇద్దరు చాలా నేర్చుకున్నామని, తనతో విడిపోవడం అనేది చాలా కష్టమైన పని అని చెప్పారు. అలాగే ఇప్పటికి తానంటే ప్రత్యకమైన అభిమానం ఉందని 2012లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
అప్పటికే ఆమెతో విడిపోయి 10 సంవత్సరాలు అయింది. ఆ తరువాత కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు. 2021లో తనతో కూడా విడిపోయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో తన మొదటి భార్య రీనాతో కలిసి కనిపించడంతో ఇద్దరు మళ్లీ కలిసిపోయారంటూ వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం అమీర్ ఖాన్ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆయన నుంచి వచ్చిన చివరి సినిమా లాల్ సింగ్ చడ్డా అనుకున్నంత ఆడలేదు. మళ్లీ 2024లో ఓ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో కమ్ బ్యాక్ ఇస్తారని తెలుస్తుంది.