2024లో తెలంగాణ యాసలో తెరకెక్కి చాలా సినిమాలు సక్సెస్ అయ్యాయి. సిద్దు జొన్నలగడ్డ నటించిన ‘టిల్లు స్క్వేర్’ రూ.100 కోట్ల క్లబ్లో చేరి బ్లాక్ బస్టర్గా నిలిచింది. HYD సంస్థానం అరాచక పాలనపై వచ్చిన ‘రజాకార్’, తెలంగాణ పెళ్లి సాంప్రదాయాల నేపథ్యంలో వచ్చిన ‘లగ్గం’ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాయి. పొట్టేల్, కేసీఆర్ చిత్రాలు ఫర్వాలేదనిపించాయి.