మంచు విష్ణు టైటిల్ రోల్లో నటిస్తోన్న సినిమా ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో నటి ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా మేకర్స్ ఆమె లుక్ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో ప్రీతి.. రాకుమారి నెమలి పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. ఇక మంచు మోహన్ బాబు నిర్మిస్తోన్న ఈ సినిమా 2025 ఏప్రిల్ 25న విడుదల కానుంది.