స్టార్ హీరోయిన్ సమంత కథానాయికగా ‘మా ఇంటి బంగారం’ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. నందిని రెడ్డి తెరకెక్కించనున్న ఈ సినిమా 1980ల నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇందులో సామ్ పాత్ర యాక్షన్ కోణంలో సాగనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానున్నట్లు టాక్ వినిపిస్తుంది.