హాలీవుడ్లో విషాదం నెలకొంది. నెట్ఫ్లిక్స్ సిరీస్ ‘ఎమిలీ ఇన్ పారిస్’ అసిస్టెంట్ డైరెక్టర్ డియాగో బొరెల్లా కన్నుమూశారు. ఈ సిరీస్ షూటింగ్లో ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే సెట్లో ఉన్న వైద్య సిబ్బంది.. ఆయన ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆయన మరణించారు. అయితే గుండెపోటు కారణంగా ఆయన చనిపోయినట్లు తెలుస్తోంది.