RR: వామపక్షాలకు దొరికిన వరం సురవరం సుధాకర్ రెడ్డి అని సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీను అన్నారు. షాద్నగర్ ముఖ్యకూడలిలో సురవరం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సురవరం తన జీవితం మొత్తం కమ్యూనిస్టు పార్టీ ఉద్యమానికి అంకితం చేశారని, కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేశారన్నారు.