NZB: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్నారనే సమాచారం మేరకు శనివారం సోదాలు నిర్వహించినట్లు సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధిక వడ్డీ వసూలు చేస్తున్న వారి నుంచి రూ.13,97,600 నగదు,రూ.7 కోట్ల విలువైన ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.