TG: సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. 20 నెలల తన పాలన చూపించి ఉపఎన్నికలకు వెళ్లే దమ్ము రేవంత్‌కు ఉందా అని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.