మేడ్చల్: వందేళ్ల ప్రణాళికతో హైడ్రా పని చేస్తోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. హైడ్రా ఒకటి రెండేళ్లకు పరిమితం కాదు. నగర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ప్రణాళికతో అంచలంచెలుగా ముందుకు వెళుతున్నట్లు వివరించారు. దాదాపు 500 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడమని, దీని విలువ రూ. 30 వేల కోట్లకు పైగా ఉంటుందని చెప్పారు.