తమిళ హీరో విజయ్ సేతుపతి, నిత్య మీనన్ జంటగా నటించిన మూవీ ‘తలైవన్ తలైవి’. తెలుగులో ‘సార్ మేడమ్’ పేరుతో విడుదలైంది. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.