NRML: బోథ్ నుంచి సారంగాపూర్ మండలం అడెల్లి పోచమ్మ దేవాలయానికి వెళ్లే మొరం రోడ్డు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కోతకు గురైంది. దీంతో రోడ్డుపై మోకాళ్ల లోతు వరకు గుంతలు ఏర్పడ్డాయని ద్విచక్ర వాహనదారులు వాపోతున్నారు. ద్విచక్ర వాహనాలు వెళ్లాలంటేనే ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై గుంతలను పూడ్చాలని కోరారు.