NZB: ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్‌కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నగర కార్యదర్శి ఎం.సుధాకర్ డిమాండ్ చేశారు. MBBS నాలుగవ సంవత్సరం చదువుతున్న మెడికోపై పీజీ మెడిసిన్ చేస్తున్న సీనియర్ సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసి, భౌతిక దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.