KNR: చొప్పదండి మండలంలోని జాన్సీ పాఠశాల సమీపంలోని రోడ్డుపై ఆదివారం ఒకేసారి రెండు ప్రమాదాలు జరిగాయి. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి రెండు వాహనాలు అదుపుతప్పాయి. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న వ్యక్తికి, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో తరచుగా, గుంతల కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.