NLG: మిషన్ త్రిబుల్ ఆర్” (రోడ్డు సేఫ్టీ, రూల్స్, రెస్పాన్సిబిలిటీ) కార్యక్రమం భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. రోడ్డు నియమాలు పాటించడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం అందరి బాధ్యత అని తెలిపారు. అతివేగం, మద్యం సేవించి నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా వాహనాలు నడపడం ప్రమాద కారణాలుగా పేర్కొన్నారు.