MNCL: బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీ 27వ వార్డులో తెలుగుదేశం పార్టీకి చెందిన జెండాను తొలగించిన వ్యక్తులను పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం నాయకులు మాట్లాడుతూ.. పార్టీ జెండాను తొలగించడం ప్రజాస్వామ్యంపై దాడితో సమానమే అన్నారు. CC TV ఫుటేజీ పరిశీలించి నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలన్నారు.