IIT గౌహతి GATE-2026 (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్) రిజిస్ట్రేషన్ ప్రక్రియ షెడ్యూల్ విడుదలైంది. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ gate2026.iitg.ac.in నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 25 వరకు కొనసాగనుంది. ఆలస్య రుసుముతో అక్టోబర్ 6 వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు.