TPT: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో రేణిగుంటకు చేరుకున్న ఆయనను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు శాలువాతో సత్కరించి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కేంద్రమంత్రి రోడ్డు మార్గాన తిరుపతికి బయలుదేరారు.