డైరెక్టర్ సుకుమార్ సతీమణి తబిత ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. పుష్ప మూవీ కోసం అల్లు అర్జున్, సుక్కు, చిత్ర బృందం ఎంతో కష్టపడ్డారని, ఈ సినిమా కేవలం ఇంట్రెస్టింగ్ మాత్రమే కాదు, ఒక ఎమోషనల్ అని తెలిపింది. కథలు చదివే దగ్గర నుంచి అందరిచేత పొగడ్తలు అందుకునే వరకు మీ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొంది. మీ సక్సెస్‌లో మీ పక్కన ఉన్నందుకు చాలా హ్యాపీగా, గర్వంగా అనిపిస్తుందని పేర్కొంది.