అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పుష్ప-2’. ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ‘పుష్ప-2’ కి కొనసాగింపుగా ‘పుష్ప-3’ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఒక ఫొటో బయటకు వచ్చింది. ఈ సినిమాకు సౌండ్ ఇంజినీర్‌గా పనిచేసిన రసూల్ తన టీమ్‌తో కలిసి దిగిన ఓ ఫొటోలో ‘పుష్ప-3: ది ర్యాంపేజ్’ అనే టైటిల్ కనిపించింది. దీంతో ‘పుష్ప-3’ కచ్చితంగా ఉంటుందని సినీవర్గాలు చెప్తున్నాయి.