ఈ ఏడాదిలో పలు రీమేక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వాటిల్లో కొన్ని విజయం సాధించగా మరికొన్ని పరాజయం పొందాయి. నాగార్జున నటించిన ‘నా సామిరంగ’.. మలయాళ మూవీ ‘పొరింజు మరియం జోస్’కు రీమేక్. మంచి విజయం అందుకుంది. రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’ బాలీవుడ్ మూవీ ‘రైడ్’కు రీమేక్. ఇది పరాజయం పొందింది. అల్లు శిరీష్ ‘బడ్డీ’ తమిళ సినిమా ‘టెడ్డీ’కి రీమేక్. ఈ సినిమా ఫ్లాప్ అయింది.