అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప2’ ఈనెల 5న విడుదల కానుంది. ఈ మూవీని 3డీ వెర్షన్లో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. అయితే, ప్రస్తుతానికి అన్ని థియేటర్స్‌లోనూ 2డీ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. 3డీపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే 3డీ వెర్షన్ టికెట్స్ బుక్ చేసుకుంటే, ఆ షో క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉన్నట్లు చిత్ర వర్గాలు చెప్తున్నాయి.