సూపర్ స్టార్ రజనీకాంత్- దర్శకుడు నెల్సన్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ జైలర్. ఈ సినిమాకు సీక్వెల్‌గా జైలర్-2 రాబోతోంది. ఈ మూవీకి సంబంధించి తలైవా బర్త్ డే రోజు సాలిడ్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అయితే జైలర్-2లో నెల్సన్ మరిన్ని స్పెషల్ అట్రాక్షన్స్ జోడించనున్నారట. మొదటి భాగంలో ఉన్న స్పెషల్ క్యారెక్టర్స్‌తో పాటు మరికొందరు ఇందులో మెరవనున్నారట. అలాగే రమ్యకృష్ణ పాత్రను మరొకరు చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.