నటుడు సత్యదేవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను నటించిన ‘బ్లఫ్ మాస్టర్’ హిట్ అయి ఉంటే తన సినిమాల ఎంపిక మరొక విధంగా ఉండేదని తెలిపాడు. ఇప్పటివరకూ తాను చేసిన సినిమాలన్నీ నమ్మి చేసినవేనని చెప్పాడు. అలాగే, ‘ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య’పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చాడు. కొవిడ్ కారణంగా దానికి కూడా సరిగా డబ్బులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.