ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా ఈనెల 5న విడుదల కానుంది. కాగా, తెలంగాణలో మూవీ విడుదలకు లైన్‌క్లియర్ అయ్యింది. బెనిఫిట్ షోకు రూ.800 వసూలు చేస్తున్నారని పిటిషన్ వేయడంతో హైకోర్టులో విచారణ జరిపారు. చివరి నిమిషంలో సినిమా విడుదలను ఆపలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.