ఐకాన్ స్టార్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. తాజాగా ఈ సినిమా HYDలోని ఐకానిక్ సంధ్య థియేటర్లో పవన్ కళ్యాణ్ ఖుషి నెలకొల్పిన 23ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. 2001లో వచ్చిన ఖుషి రూ.1.56 కోట్లు సాధించగా.. ‘పుష్ప 2’ రూ.1.59 కోట్లు రాబట్టింది. దీంతో ఫ్యాన్స్ బన్నీకి సెల్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.