హీరోయిన్ శ్రద్ధా ఆర్య కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్స్టా వేదికగా ప్రకటించింది. గత నెల 29న తనకు ప్రసవం జరిగినట్లు తెలిపింది. కాగా, 2006లో ‘కలవనిన్ కదలై’ అనే తమిళ సినిమాతో శ్రద్ధా హీరోయిన్గా పరిచయం అయింది. తెలుగులో గొడవ, కోతిమూక, రోమియో సినిమాల్లో నటించింది. గతేడాది విడుదలైన హిందీ మూవీ ‘రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించింది.