Tiger 3 Movie: సల్మాన్, షారుఖ్ కోసం 35 కోట్ల యాక్షన్ సీక్వెన్స్!
బాలీవుడ్లో ఖాన్ త్రయం గురించి అందరికీ తెలిసిందే. అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్.. ఈ ముగ్గురే గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌ని ఏలుతున్నారు. వీళ్లు ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా.. తమ తమ సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తూ.. ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తుంటారు. అయితే ఈ మధ్య ఖాన్ త్రయం కాస్త వెనకపబడిపోయింది. కానీ కింగ్ ఖాన్ ఈజ్ బ్యాక్ అంటూ.. పఠాన్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేశాడు షారుఖ్ ఖాన్. అదే జోష్‌లో సల్మాన్, షారుఖ్ మరోసారి బాక్సాఫీస్‌ని షేక్ చేయడానికి వస్తున్నారు. అందుకోసం కోట్లకు కోట్లే కుమ్మరిస్తున్నారు మేకర్స్.
పఠాన్ సినిమా(Patan Movie) ఏకంగా వెయ్యి కోట్లు రాబట్టి.. బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. అప్పటి వరకు వరుస ఫ్లాపుల్లో ఉన్న బాద్షాకు పఠాన్ సినిమా సాలిడ్ హిట్ ఇచ్చింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పియరెన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ ఇద్దరు చేసిన యాక్షన్‌కు థియేటర్ టాపులు లేచిపోయాయి. అయితే ఇటీవల విడుదలైన సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రం ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అందుకే అప్ కమింగ్ మూవీతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు సల్మాన్. అది కూడా షారుఖ్ ఖాన్‌తో కలిసి వస్తున్నాడు. గతంలో వచ్చిన టైగర్ సిరీస్‌లలో.. ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి.
అందుకే ఇప్పుడు ఆ రెండు చిత్రాలకు మించి ‘టైగర్ 3′(Tiger 3 movie) రాబోతోంది. ఇందులో సల్మాన్ ఖాన్‌తో పాటు షారుఖ్ కూడా కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ మూవీ హై ఓల్టేజ్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతోంది. ముఖ్యంగా సల్మాన్, షారుఖ్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలవబోతున్నాయట. కేవలం ఈ ఇద్దరి ఒక్క యాక్షన్ సీన్స్ కోసమే.. ఏకంగా 35 కోట్లు ఖర్చు చేస్తున్నారట. అందుకోసం ప్రత్యేకంగా జైల్ హౌస్ సెట్‌ను నిర్మిస్తున్నారట. మే 8 నుంచి ఈ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారని బాలీవుడ్ ఫిల్మ్ వర్గాల సమాచారం. దాదాపు 15 రోజుల పాటు ఈ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ‘టైగర్ 3’ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తుండగా.. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. సల్మాన్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్గా నటిస్తోంది.