భారతీయ చిత్ర పరిశ్రమలో ‘ధురంధర్’ సంచలనం సృష్టిస్తోంది. ‘ధురంధర్’, ‘ధురంధర్ 2’ చిత్రాలు కలిపి ఏకంగా రూ.3 వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డును నెలకొల్పాయి. ఒకే ఫ్రాంఛైజీ ఈ స్థాయిలో కలెక్షన్లు సాధించడం భారతీయ సినిమా చరిత్రలో ఇదే తొలిసారి. ఇక రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించాడు.