మహబూబ్నగర్ జిల్లా నూతన డీఈవోగా ప్రస్తుతం మేడ్చల్ డీఈవోగా పనిచేస్తున్న విజయకుమారిని నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పలు ఆరోపణల నేపథ్యంలో దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న మాజీ డీఈవో ప్రవీణ్ కుమార్ సెలవులు ఈ నెల 30తో ముగియనున్నాయి. ఆయన సూర్యాపేటలో ఏడీగా చేరనున్నట్లు సమాచారం. విజయకుమారి సోమవారం డీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు