‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమా నటీనటులను మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సత్కరించారు. గుజరాత్ అల్లర్లు, గోధ్రా రైలు దహన కాండను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంపై ప్రధాని మోదీ సైతం ప్రశంసలు కురిపించారు. తాజాగా.. ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించిన విక్రాంత్ మాస్సే, రాశీఖన్నాలను మధ్యప్రదేశ్ సీఎం సత్కరించారు. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ధీరజ్ ఖన్నా తెరకెక్కించారు.