ఈ మధ్యకాలంలో సినిమా టికెట్ల ధరలు భారీగా పెరుతున్నాయి. థియేటర్లలో విలాసవంతమైన సౌకర్యాలు పెరగడం ఓ కారణం. అలాగే భారీ బడ్జెట్తో తీసే సినిమాల మూలంగా కూడా టికెట్ల ధరలు పెరుగుతున్నాయి. పాన్ ఇండియా మూవీలకు అసలు బడ్జెట్ కంటే అదనంగా ఖర్చు చేస్తున్నారు. నటుల రెమ్యనరేషన్లు, భారీ సెట్లు, లొకేషన్లు, VFXల కారణంగా కూడా ధరలు అధికం అవుతున్నాయి.